తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో 'తెలుగు తల్లికి పద్యాభిషేకం'
తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో
'తెలుగు తల్లికి పద్యాభిషేకం'
ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న 'నెల నెలా తెలుగు వెలుగు'లో భాగంగా ఫిబ్రవరి 27న, 33వ అంతర్జాల దృశ్య సమావేశం 'తెలుగుతల్లికి పద్యాభిషేకం' అనే కార్యక్రమం అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా జరిగింది.
తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి సమావేశాన్ని ప్రారంభించి. తక్కువ మాటలతో ఎక్కువ భావాలను పలికించగల శక్తి పద్యాని కున్నదని, పద్యం రాయగల్గడం ఒక ప్రత్యేక కళ అని, ఈనాటి కార్యక్రమంలో ఇంతమంది లబ్ధప్రతిష్ఠులు పాల్గొనడం చాలా సంతోషం అంటూ అతిథులకు ఆహ్వానం పలికారు.
తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా॥ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ, ఏ ఇతర భాష లకూ లేని పద్యం, అవధానం లాంటి సౌందర్యం, సాగసులు మన తెలుగు భాషకున్నా యని, ఇంతటి ఘనమైన మన మాతృభాషా పరిరక్షణ, పర్వ్యాప్తి కోసం తానా కంకణం కట్టుకుని ఎన్నో దశాబ్దాలుగా ఆవిరళ కృషి చేస్తున్నదని తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సాహితీవేత్త, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ డా. వెలుగోటి భాస్కర సాయికృష్ణ యాచేంద్రను డా. ప్రసాద్ తోటకూర సభకు పరిచయం చేస్తూ సాధారణంగా రాజులు సంగీత, సాహిత్య, నృత్యాం శాలను అభిమానిస్తూ, ఆదరిస్తుంటారు. కాని వేంకట గిరి సంస్థానంలో వెలుగోటి రాజవంశంలో జన్మించిన డా. సాయికృష్ణ యాచేంద్ర స్వతహాగా సంగీత సాహిత్య ప్రతిభామూర్తి గావడం, మద్రాసు విశ్వ విద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో పిహెచ్.డి పట్టా పొందడం విశేషం అన్నారు.

డా. సాయికృష్ణ యాచేంద్ర తన కీలకోపన్యాసం లో సాహిత్యలోకంలో అంతగా ప్రచారంలో లేని ప్రముఖ యోగిని, గొప్ప కవయిత్రి తరిగొండ వెంగ మాంబ కలం నుండి భాగవతం, వేంకటాచల మహాత్మ్యం, రమా పరిణయం, యక్షగాన కృతులు, శివనాటకం లాంటి అనేక ఉత్తమ సాహిత్య గ్రంథాలు వెలువడ్డాయని, 12 స్కంధాల భాగవతంలో 7, 8, 9, స్కందాలు అలభ్యంగా ఉన్నాయని, వాటి కోసం శోధించవలసిన అవసరం ఉందన్నారు. బాల వితంతువైన వెంగమాంబ ఎక్కువ కాలం ధ్యాన యోగంలో గడిపేవారని, ఆనాటి సామాజిక పరి స్థితుల వల్ల తాను నిరాదరణకు గురైనా వాటి నన్నింటినీ తట్టుకుంటూ ఎదురునిల్చి పోరాడిన ఆమె జీవితం నారీ జనాభ్యుదయానికి నాందీగీతంగా నిలు స్తుందని అన్నారు.
గౌరవ అతిథులుగా హాజరైన ప్రముఖ కవి, నటుడు, గాయకుడు, ప్రయోక్త డా. అక్కిరాజు సుందర రామకృష్ణ, ప్రముఖ రచయిత, నటుడు, సంగీత నవావధాని, 'కళారత్న' డా. మీగడ రామలింగ స్వామి: 'పరవస్తు పద్యపీఠం' మరియు 'తెలుగు దండు' వ్యవస్థాపక అధ్యక్షుడు పరవస్తు పణి శయన సూరి: పనిచేస్తున్న ఉద్యోగానికి స్వస్తి పలికి, పూర్తి కాలం తెలుగు భాషా సాహిత్య వికాసాలకు అంకితమై 'పద్యపరిమళం' యుట్యూబ్ ఛానల్ ద్వారా పద్యాలి షేకం చేస్తున్న పాతూరి కొండల్ రెడ్డి: ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రంలో డైరెక్టర్గా సుదీర్ఘకాలం పని చేసిన ప్రముఖ సినీ, జానపద, శాస్త్రీయ గాయకులు చంద్రతేజ: కేంద్రప్రభుత్వ సంస్థలో ఒక భాద్యతా యుతమైన పదవిలో పనిచేసిన, ఆకాశవాణిలో లలిత సంగీతంలో ఉత్తమశ్రేణి కళాకారుడుగా గుర్తింపు పొందిన మధుర గాయకులు తాతా బాలకామేశ్వర రావులు సుప్రసిద్ధ సాహితీవేత్తలు, కవులు, పండితులు, రచయితలు సృష్టించిన సాహిత్యం నుండి, చలనచిత్రాల నుండి అనేక పద్యాలను శ్రావ్యంగా ఆలపించి, తమ గానమాధుర్యంతో తెలుగుతల్లికి పద్యాభిషేకం చేసి పరవ శింపజేశారు.
పాల్గొన్న ముఖ్య అతిథి, గౌరవ అతిథులకు, సహకారం అందిస్తున్న ప్రసార మాధ్యమాలకు . ప్రసాద్ తోటకూర కృతజ్ఞతలను తెలియజేస్తూ 'ప్రపంచ రంగస్థల దినోత్సవం' సందర్భంగా మార్చి 27న 'పౌరాణిక నాటక వైభవం' అనే 34వ సాహిత్య కార్యక్రమం అంతర్జాల దృశ్య సమావేశంగా జరుగు తుందని ప్రకటించారు.
'తెలుగు తల్లికి పద్యాభిషేకం' పూర్తి కార్య క్రమాన్ని ఈ క్రింది లంకె ద్వారా వీక్షించవచ్చును.