తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆవిర్భావం
'తానా ప్రపంచ సాహిత్యవేదిక' ఆవిర్భావం
భాషాచరిత్రలో చారిత్రాత్మక ఘట్టం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) సాహిత్య విభాగంగా 'తానా ప్రపంచ సాహిత్యవేదిక'ను ఏర్పాటు చేయటం తెలుగు భాషా చరిత్రలో ఒక మైలురాయిగా అభివర్ణించవచ్చు.
ప్రపంచంలోని దాదాపు 18 కోట్ల మంది తెలుగు వారి మనసు భాష, మాతృభాష, మన తెలుగు భాష. ఇటువంటి తెలుగు భాషను పరిరక్షించుకోవటానికి, తెలుగు సాహితీ ప్రక్రియలను కాపాడుకోవటానికి అత్యంత విలువైన తెలుగు సంస్కృతికి పరిపుష్టిని కలిగించటానికి ప్రపంచంలోని తెలుగు భాషీయు లను, తెలుగు భాషాభిమానులను, తెలుగు పండితు లను, కళాకారులు- అందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి ఒక సుసంపన్నమైన సంఘటిత భాషా స్ఫూర్తిని, సాంస్కృతిక వారసత్వ శక్తిని ప్రకటించ దానికి, ఆ సంపదను భావితరాలకు అందించడానికి ఈ వేదికను ఏర్పాటుచేయడం జరిగింది.
మేదోమదనంతో, దీర్ఘకాలికమైన ప్రయోజ సంతో, విశిష్టమైన ప్రణాళికలతో, ఆకుంరితమైన మాతృభాషాభిమానంతో, ముందుచూపుతో తానా వారు సంపూర్ణమైన ప్రయత్నం చేశారని చెప్పాలి. భాషా పరిరక్షణ కోసం మొదలైన మహాయజ్ఞంగా దీనిని అభివర్ణించవచ్చు.
'తానా ప్రపంచ సాహిత్య వేదిక'ను ప్రారంభిస్తూ తానా అధ్యక్షులు శ్రీ జయశేఖర్ తాళ్లూరి మాట్లా డుతూ, "అందమైన భాష, తీయనైన భాష, మన తెలుగు భాష, పరిపాలనకైనా, పలుకుబడికైనా, పాట కైనా, మంచిమాటకైనా అనువైనది ఈ భాష అందుకే ఈ భాషను 'ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్' అని అన్నారు. పెద్దలు.
"దేశభాషలందు తెలుగు లెస్స' అన్నారు శ్రీకృష్ణ దేవరాయలు. ఇటువంటి గొప్ప భాష మన మాతృ భాష అయినందుకు మనం గర్వపడాలి. అటువంటి గొప్పదైన తెలుగుభాష ప్రస్తుతం నిరాదరణకు గురవు తోంది. భాషలోని మాధుర్యాన్ని భావితరాలకు తెలియజేసి మన భాషను పరిరక్షించాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. ఏ బిడ్డకైనా మాతృభాషలో పునాదులు పడితే ఇతర భాషలు సులభంగా వస్తాయి. మేధ కూడా పెరుగుతుంది. భావ స్పష్టత ఉంటుంది. అంతేకానీ పరభాషలో వునాదులు వేయడం సరికాదని మా భావన.
"ఈ తరానికి మన భాషా మాధుర్యాన్ని అందించే ప్రయత్నంలో తానా ముందుండి పని చేస్తుంది. భాషా వైభవం ఈ తరానికి తెలిసేలా అనేక కార్యక్రమాలు చేయబోతున్నాము భాషాభివృద్ధికి తానా సాహిత్య వేదిక ద్వారా చిత్తశుద్ధితో కృషి చేస్తాం," అని ఆయన అన్నారు.
తెలుగు సాహిత్యం అత్యంత విలువైనది. మన జ్ఞానం, మన విజ్ఞానం అంతా భాష ద్వారా, సాహిత్యం ద్వారా భావితరాలకు చేరుతుంది. ఎప్పుడైతే మాతృ భాషాసాహిత్యాలు పిల్లలకు దూరమయ్యాయో పెద్దలు తరతరాలుగా నిక్షిప్తం చేసిన జ్ఞానం కూడా కనుమరుగవుతుంది. కాబట్టి సాహిత్యాన్ని పరిరక్షించు కోవాల్సిన అవసరం ఉంది. మన సాహిత్యంలో అనేక ప్రక్రియలున్నాయి. పద్యం, అవధానం, వచన కవిత్వం, గేయం, మినీకవిత్వం, కథానిక, కథ, నవల-ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ ప్రక్రియలను ప్రోత్సహించడానికి తానా వేదిక పూనుకుంటుంది.
తెలుగు సంస్కృతి ఎంతో గొప్పది. అది ప్రకృతితో మమేకమైన సంస్కృతి. విలువైనది కూడా. మన పండుగలు సంప్రదాయాలు ఎంతో ఉత్తమ మైనవి, ఉదాత్తమైనవి. వీటన్నింటిని పరిరక్షించు కోవాల్సిన అవసరం నేడు ఉంది. వీటిని భావితరా లకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. తానా దానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది. తెలుగు భాషా సాహిత్య సంస్కృతుల పరిరక్షణ కోసం అనేక కార్య క్రమాలు చేపట్టబోతుంది తానా వేదిక, సాహిత్యవేదిక ద్వారా నెల నెలా క్రమం తప్పకుండా సాహిత్య కార్య క్రమాలు నిర్వహించబోతున్నారు. అంతేకాకుండా సందర్భానుసారం కవిసమ్మేళనాలు, ఆవధానాలు, కవితల పోటీలుతో పాటు బాలబాలికలు, మహిళ లను, వర్ధమాన కవులను ప్రోత్సహించే విధంగా వినూ త్నమైన, నిర్మాణాత్మకమైన ప్రణాళికలతో ముందుకు వస్తుంది వేదిక.
సాహిత్యరంగంలో నిష్ణాతులైన తానా పెద్దల మార్గ నిర్దేశకత్వంలో, తానా కార్యవర్గ సభ్యుల సహ కారంతో చక్కటి కార్యక్రమాలు నిర్వహించబడ తాయి. తెలుగుభాషకు నూతన శోభను తేవడానికి, కవులలో సరికొత్త ఉత్సాహాన్ని కలిగించటానికి పూనికతో ముందుకు కదులుతోంది వేదిక.
తానా పూర్వాధ్యక్షులు, భాషాప్రియులు, నిరం తర సాహితీ సేవాతత్పరులు శ్రీ ప్రసాద్ తోటకూర నిర్వహణలో ఈ వేదిక ద్విగుణీకృతోత్సాహంతో మహో జ్వలమైన భాషోద్యమం నిర్వహించబోతుంది.
శత శతకకవి శ్రీ శ్రీనివాస్ చిగురుమళ్ల సమ స్వయకర్తగా విశిష్టమైన సేవలు అందించబోతు న్నారు.
ప్రారంభ కార్యక్రమంగా ప్రఖ్యాత జానపద వాగ్గేయకారుడు వంగపండు ప్రసాద్ గారితో జరిగిన కార్యక్రమం శ్రోతలను ఉర్రూతలూగించింది.
రెండవ కార్యక్రమంగా జరిగిన 'ప్రపంచ స్థాయి నాన్న కవితల పోటీలు' కవులలో నూతనో త్సాహాన్ని నింపాయి. దీనిలో భాగంగానే జూన్ 21, 2020 తేదీన 'పితృ దినోత్సవం' సందర్భంగా 'నాన్నా నీకు నమస్కారం' కార్యక్రమంలో శ్రీ సిరివెన్నెల సీతా రామశాస్త్రి, శ్రీ తనికెళ్ల భరణి విశిష్ట అతిథులుగా హాజరై సాహిత్యవేదిక చేస్తున్న కృషిని అభినందిం చారు. మూడవ కార్యక్రమంగా జరిగిన కె.కె.భారవి గారితో ముఖాముఖి' కార్యక్రమం ఆద్యంతం అలరించింది.
తానా ప్రపంచ సాహిత్యవేదిక భవిష్యత్తులో అనేకమంది కవులను ప్రపంచానికి పరిచయం చేస్తుంది అనడంలో సంశయం లేదు. భాషా వైభవాన్ని ప్రపంచానికి చాటుతుంది అనడంలో సందేహం లేదు