ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో వెనుక బడిన జిల్లా గా శ్రీకాకుళం జిల్లాకు పేరు. జిల్లాలో రాజాం నియోజకవర్గ పరిధిలో 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు చదువుతున్న పేద పిల్లలకు విలువలతో కూడిన విద్యను ఉచితంగా అందివ్వాలని బాలవికాస కేంద్రాలు ప్రారంభించాము. ఇప్పుడు వాటిలో 10వ తరగతి వరకు శిక్షణ ఇస్తున్నాం.
విద్యతో బాటుగా ఈ కేంద్రాల్లో పిల్లలకు పెద్దల పట్ల గౌరవం, దేశం పట్ల భక్తి, సమాజం పట్ల బాధ్యతగా ఎలా ఉండాలో కూడా నేర్పించాలి అని ఒక అజెండాతో ముందుకు వెళ్తున్నాం.
మానసిక వికాసం తో బాటుగా శారీరక వికాసం కూడా చాలా ముఖ్యం అని భావించి ప్రతి శనివారం పిల్లలతో ఆటలు ఆడించే లా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం.
ఈ బాలవికాస కేంద్రాలను శిక్షణ పొందిన సేవా గుణం కలిగిన విద్యార్థులను ట్రైనర్లు గా మార్చి వారి ఆధ్వర్యంలో , పర్యవేక్షణ లో నడుపుతున్నాము.
jOIN TANA TODAY
Let us join hands to address the needs of the Telugu Community globally.