TANA Paatasala In New York
“తానా” సంస్థ రూపకల్పన చేసి న్యూయార్క్ నగరంలో ప్రప్రథమంగా ప్రారంభిస్తున్న “పాఠశాల” తెలుగు నేర్చుకునే ప్రవాసాంధ్రుల పిల్లలకు ఒక సువర్ణావకాశం. న్యూయార్క్ననగరంలో “పాఠశాల” ఒక కొత్త బడి. “పాఠశాల” మనoదరి బడి. మన మాతృభాషలో మన పిల్లలు అక్షరాలు దిద్దుకునే అమ్మఒడి.
“తానా” సంస్థ ఎంతోమంది భాషా పండితులను సంప్రదించి వారి సూచనలతో, ఆశీస్సులతో మన తెలుగు భాషని, తెలుగు భాష వైభవాన్ని, వారసత్వాన్ని మన పిల్లలందరికీ అందజేయాలనే సదుద్దేస్స్యంతో ఈ “పాఠశాల” ని తానా సంస్థ ప్రారంభిస్తోంది.
“పాఠశాల” మీది.. మనది..మనందరిదీ. ఆదరించండి.ఆశీర్వదించండి.
రండి! “పాఠశాల” లో మన పిల్లలను చేర్పిద్దాం!!
మన పిల్లలకు మన తెలుగుభాషను నేర్పిద్దాం!!!.

Posted By: TANA
Posted On: Jul 29,2020