President Message

 

JayTalluri

అoదరికి నమస్కారం.

అందమైన పూలు వందయున్నాగాని, దారం ఒకటిలేక దండయగునా" అలా ఉత్తర అమెరికాలోని తెలుగువారందరిని ఒక దండలా చేర్చిన తెలుగు భాషకి, తానా కి శిరస్సువంచి నమస్కరిస్తున్నాను.

 అమెరికాలో తెలుగు బాషాని, తెలుగు సాంప్రదాయ సాంస్కృతుల మనుగడను మరియు తెలుగు వారికీ ఎటువంటి ఆపద వచ్చిన మేము ఉన్నామంటూ, మనకంటూ ఒక సంస్థ ఉండాలని అలోచించి ముఖ్యమైన తెలుగు ప్రముఖులందరూ కలిసి 1977వ సంవత్సరంలో తానా అనే స్వచ్చంద సేవ సంస్థను స్థాపించారు. అంతటి అతి పెద్ద, ప్రాచీనా మహోన్నతమైనటువంటి తానా సంస్థకు నన్ను తానా అధ్యక్షుడిగా ఎన్నుకున్న ఉత్తర అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలందరికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి గొప్ప సంస్థకు అధ్యక్షుడిగా ఎన్నిక అవ్వడం ఒక అదృష్టం, అని అనుకునేదానికంటె ఎక్కువగా ఇది నామీద ఉన్న ఒక అతిపెద్ద గొప్ప బాధ్యతగా స్వీకరిస్తున్నాను. ఆ రోజు వ్యవస్థాపక లక్ష్యం, తెలుగు భాషను, సాంప్రదాయ సాంస్కృతులను కాపాడటం అయినప్పటికీ, ఆ తరువాత, మనకు విద్య బుద్దులు నేర్పించినటువంటి, మన జన్మ భూమికి , కన్నతల్లికి సేవ చేయాలనే ఆలోచనతో మన TANA వ్యవస్థాపక సభ్యులు, పెద్దలు TANA ఫౌండేషన్ ను స్థాపించారు. నా, తన, పర అనే బేధం లేకుండా నాటి నుండి నేటి వరకు TANA చేస్తున్న సేవలు చిరస్మరణీయం.

నా వంతు కృషిగా తానా చేసే కార్యక్రమాలు ప్రపంచ నలుమూలలా ఉండే తెలుగుప్రజలందరికి చేరేలా , తానా సభ్యుల సంఖ్య మరింత పెరిగేలా , తానా సంస్థ బలోపేతానికి మరియు తానా కీర్తిప్రతిష్టలు అన్ని దిశలా విస్తరించేలా  కృషిచేస్తాను.

Our Mission: ”To identify and address social, cultural and educational NEEDS of North American Telugu Community in particular and Telugu people in general”

Foundation:  “To Share, To Care and To Serve the needy“

ఈ వాంగ్మూలాన్ని నేను, నా కార్యవర్గసభ్యులందరు అంతఃకర్ణశుద్ధితో పాటిస్తామని మరియు తెలుగుప్రజల శ్రేయస్సుకొరకు ఎన్నో విన్నూత్నమైన సేవాకార్యక్రమాలు అయినా TEAM SQUARE, TANA CARES, TANA CURIE, TANA BACKPACK, TANA హెల్త్ క్యాంప్స్ , TANA scholarships , మరియు TANA ఫౌండేషన్ ద్వారా  TANA 5K RUNS, TANA DGITAL CLASS ROOMS నిర్మాణం TANA ద్వారా  అందిస్తామని ప్రమాణం చేస్తున్నాము. నేను ఎల్లప్పుడూ క్రొత్త ఆలోచనలకూ మరియు క్రొత్తవారిని TANA లో మరింత చురుకుగా పనిచేయటానికి ప్రోత్సహమిస్తాను, దీని ద్వారా అమెరికా మరియు కెనడా లో ఉన్న ప్రతి చిన్న నగరాలలో TANA సేవలు విస్తృతం చేయడానికి మరియు మా మిషన్‌కు అనుగుణంగా సేవలను అందించడానికి సమగ్ర విధానంతో చొచ్చుకుపోయేలా చేస్తుంది. TANA ఎగ్జిక్యూటివ్ కమిటీ, BOD మరియు ఫౌండేషన్ యొక్క ఆలోచనలను క్షేత్రస్థాయిలో అందించటానికి, నేను నా, City Coordinators, Regional Coordinators, Ad-Hoc కమిటీలతో మరియు ఇతర  కార్యవర్గసభ్యులతో  క్రమం తప్పకుండా సంప్రదిస్తాను.

గడిచిన ఇన్ని ఏళ్లలో తానా సమర్థవంతమైన ఎన్నో రకాలా సేవలను  ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అందించింది. తానా యొక్క లక్ష్యాన్ని చేరడానికి మరియు తెలుగు మాట్లాడే ప్రజల వారసత్వాన్ని ఉత్తర అమెరికా ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి కృషిచేస్తాము. అదేవిధంగా, తానా, అమెరికాలోని అన్ని తెలుగు సంఘాలతో కలిసి ఒక వసుదైక కుటుంబంలా పనిచేయటానికి మేమందరం కృషిచేస్తాము.

గత కొన్నియేళ్ళుగా TANA ఒక ప్రాంతానికి , ఒక రాజకీయా పార్టీకి మరియు ఒక సామజిక వర్గానికి చెందింది అని  కొన్ని అపోహలు ఉన్నాయి. ఈ అపోహలన్నిటిని కూకటివ్రేళ్ళతో శాశ్వతంగా నిర్ములించేలా TANA అనేది ప్రతితెలుగువాడి గుండెచప్పుడు అయ్యేవిందంగా మరియు TANA చేసే సేవా కార్యక్రమాలను ప్రతి తెలుగువాడికి అందించేవిదంగా నా వంతు బాధ్యతగా కృషిచేస్తాను. అదేవిదంగా, అమెరికాలో పుట్టి పెరుగుతున్న తెలుగు నవ యువతరాన్ని తానాలో భాగస్వాముల్ని చేసి వారిని తానాలో ముఖ్యభూమికను పోషించే విదంగా కృషిచేస్తాను. అలాగే, వారిలో నాయకత్వలక్షణాలు పెరిగే దిశగా కృషిచేస్తాను.

నా ఆలోచన ఒక్కటే  " నేను అనుకుంటే ఒక అడుగు... మనం అనుకుంటే ముందగుడు" అన్న నినాదంతో మనమంతా కలిసికట్టుగా నడుద్దాం... తానా సేవలను, వేడుకలను మరింత ఉత్సహంగా ముమ్మరంగా చేద్దాం. తానా లక్ష్యసాధనకు అందరం ప్రయత్నిద్దాం. ఇందుకు నా వంతుగా కృషిచేస్తానని హామిఇస్తున్నాను. నా కృషిలో మీరంతా బాగస్వాములవుతారని ఆశిస్తున్నాను.

------------------------

జయశేఖర్ తాళ్లూరి

PRESIDENT TANA