తానా ఒక క్రొత్త ప్రోగ్రామ్ తో మీ ముందుకు వస్తోంది. ఆ కార్యక్రమం పేరు "తానా తెలుగు సాంస్కృతిక సిరులు ".తెలుగు రాష్ట్రల్లో గొప్ప సాంస్కృతిక సంపద ఉంది. కూచిపూడి నాట్యం, పేరిణి,కర్ణాటక సంగీతం వంటి శాస్త్రీయ కళల తో పాటు వందలాది జాన పద కళలు ఉన్నాయి.హరికథ, బుర్ర కథ, డప్పులు, గరగలు, కోలాటం, చెక్క భజన, తప్పేటగుళ్లు లాంటి కళారూపాల్ని జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన మహాను భావులన్నారు . ఆదిభట్ల నారాయణ దాసు గారు హారికధ కు, నాజర్ గారు బుర్ర కధకు ప్రపంచ ఖ్యాతి తెచ్చి పెట్టారు.అలాగే జాన పద కళల్లో లబ్ద ప్రతిష్టులు ఎంతో మంది ఉన్నారు
ఐతే దురదృష్ట వసాత్తు ఈ కళారూపాలకు రాను రాను ఆదరణ తగ్గుతూ వస్తోంది. ఐనా ఎన్ని కష్టాలు వచ్చిన జాన పద కళాకారులు వాటిని బ్రతికిస్తూ వస్తున్నారు. వాటిని నమ్ముకొనే జీవిస్తున్నారు. వాటిని మనం ఇంకా చూడగలుగు తున్నామంటే ఆ కళాకారులు చేస్తున్న త్యాగాల ఫలితమే. వారి అంకిత భావం వలనే. ఇటువంటి గొప్ప కళారూపాల్ని కొంత వరకైనా ప్రోత్సహించాలనే ఉద్దేశ్యం తో ఈ సాంస్కృతిక సిరులు అనే కార్యక్రమాన్ని రూపొందించాం. ఈ కార్యక్రమం ప్రతీ నెలా రెండవ శని వారం నిర్వహించడం జరుగుతుంది.ఈ కార్యక్రమం విజయ వంతం గా నిర్వహిస్తూ జానపద, శాస్త్రీయ, పేద కళా కారుల్ని ఆదుకోవడానికి నిధులు అవసరముంది. కాబట్టి సహృదయులు, కళా ప్రోత్సాహకులు విరివిగా విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నాము.