సిరివెన్నెల సంస్మరణలో తానా నిర్వహించిన కావ్యపోటీలకు విశేష స్పందన
సిరివెన్నెల సంస్మరణలో తానా
నిర్వహించిన కావ్యపోటీలకు విశేష స్పందన
ప్రముఖ కవి పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి సంస్మరణలో ఉత్తర అమెరికా తెలుగు
సంఘం (తానా) సాహిత్య
విభాగం “తానా ప్రపంచసాహిత్యవేదిక” 2023 మే నెలలో అంతర్జాతీయస్థాయిలో నిర్వహించిన
పద్యకావ్యాల /
గేయకావ్యాల పోటీలలో దేశ విదేశాలనుండి మొత్తం 91 మంది రచయితలు పాల్గొనడం విశేషం.
తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ .. “ఈ పోటీలలో
కేవలం
11సంవత్సరాల వయస్సున్న కుమారి అహల లక్ష్మీ అయ్యలసోమయాజుల పాల్గొని తలపండిన పండితులు,
విశేష
అనుభవంఉన్న రచయితలతో పోటీ పడడం ఆశ్చర్యం, ఆనందదాయకం అన్నారు. ఈ పోటీలకు వచ్చిన
కావ్యాలను
ముగ్గురు సాహితీ ప్రముఖులు – డా. పర్వతనేని సుబ్బారావు, డా. అద్దంకి శ్రీనివాస్ మరియు
శ్రీ తోపెల్ల
బాలసుబ్రహ్మణ్యం గార్లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి, అన్నింటిని నిశితంగా పరిశీలించి,
శ్రీ బులుసు వెంకటేశ్వర్లు
గారు (విశాఖపట్నం) రచించిన “జీవనవాహిని” ప్రధమస్థానంలో నిలిచిన పద్యకావ్యంగా ఏకగ్రీవంగా
ఎంపిక చేశారు.
ముందుగా ప్రకటించినట్లు విజేత శ్రీ బులుసు వెంకటేశ్వర్లుగారికి లక్ష రూపాయల నగదు
పురస్కారాన్ని, జ్ఞాపికను
హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 17న అందజేశాము. పోటీకి వచ్చిన 91 కావ్యాలలో 50 కావ్యాలు
తానా
ప్రచురిస్తున్న ఈ-బుక్ లో ప్రచురణకు ఎంపికగాబడ్డాయి. వాటిని తెలుగు భాషాభిమానులకు,
సాహిత్యప్రియులకు
అందజేస్తున్నాము.
తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగుభాషలో ఉన్న
వివిధ
ప్రక్రియలలో కావ్యాలు రాయడం చాల కష్టతరమైన ప్రక్రియ అని, అయినప్పటికీ దాదాపు 100 మంది
రచయితలు
పాల్గొనడం శుభపరిణామం అన్నారు.
తానా అధ్యక్షులు (2021–2023) లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ సిరివెన్నెలగారి సంస్మరణలో
నిర్వహించిన
ఈ ప్రత్యేక కావ్యపోటీలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న 91 మంది రచయితలకు, తానా ఈబుక్ లో
స్థానం పొందిన
రచయితలకు, లక్ష రూపాయల బహుమతి గెల్చుకున్న రచయిత శ్రీ బులుసు వెంకటేశ్వర్లుగారికి
శుభాకాంక్షలు, ఎంతో
సహనంతో అన్నింటినీ పరిశీలించి ఫలితాలు ప్రకటించిన న్యాయనిర్ణేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు
అన్నారు.