తానా - మంచి పుస్తకం నిర్వహణలో
తానా - మంచి పుస్తకం నిర్వహణలో
బాలసాహిత్య రచనలను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం - తానా-మంచిపుస్తకం సంయుక్తంగా రచనల పోటీ . దాదాపు 40 సంవత్సరాల తరువాత తెలుగు బాలసాహిత్యంలో ఇటువంటి పోటీని నిర్వహించడం మళ్లీ ఇదే మొదటిసారి. 21వ మహాసభల ఈ పోటీ నిర్వహణకు తానా ముందుకొచ్చింది. దీనిని రచయితలు, సాహితీవేత్తలు స్వాగతించారు, ఆదరించారు. విరివిగా రచనలు పంపి పోటీని జయప్రదం చేశారు. ఆధునిక, సాహస, హాస్య, కాల్చనిక విజ్ఞానానికి సంబంధించిన నవల లేదా కథాగుచ్ళం, సచిత్ర నవలలు లేదా కామిక్స్ స్ట్రిప్స్ వంటి రచనలను ఈ పోటీకి పంపవలసిందిగా రచయితలను కోరాము. పదేళ్లలోపు పిల్లలకు, పదేళ్లు పైబడిన పిల్లలకు అని రెండు విభాగాలుగా రచనలు ఆహ్వానించాము. ఒక్కో విభాగంలో ఐదేసి బహుమతులు ఇవ్వాలని భావించాము. అయితే పదేళ్లలోపు పిల్లల రచనలు తక్కువ వచ్చిన కారణంగా ఈ విభాగాలతో సంబంధం పది రచనలను బహుమతులకు ఎంపిక చేయవలసిందిగా న్యాయనిర్ణేతలను కోరాము.
దాదాపు 100కు పైగా రచనలు వచ్చినా, మొదటి వడపోతలో 68 రచనలను స్వీకరించి ప్రాథమిక పరిశీలన అనంతరం 22 రచనలు ఎంపిక చేశాము. వీటిని ఇద్దరు న్యాయనిర్దేతలకు పంపి పది ఉత్తమ రచనలను ఎంపిక చేయవలసిందిగా కోరాము. విజయవాడ సర్వోత్తమ గ్రంథాలయ నిర్వాహకులు డా! రావి శారద; ప్రముఖ కవి, రచయిత, పిల్లలకు రచనల వర్క్‌షాపులు నిర్వహిస్తున్న డా! ఆర్. సీతారామ్, ఖమ్మం న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
వీరిద్దరూ రచనలన్నిటినీ పరిశీలించి, రచనల నాణ్యత ఆధారంగా మరో రెండు బహుమతులు అదనంగా ఇవ్వవలసిందిగా నిర్వాహకులను కోరారు. అది ఆమోదించి ఆ ప్రకారం 12 రచనలకు బహుమతులు ప్రకటిస్తున్నాం. బహుమతిగా ఒక్కొక్క రచనకు ముందుగా నిర్ణయించినట్లుగానే రూ.10,000లు పారితోషికంతో పాటు, ఆయా రచనలను బొమ్మలతో పుస్తకాలు ప్రచురిస్తాం. పుస్తక ప్రచురణను మంచి పుస్తకం సంస్థ చేపడుతుంది.
బహుమతి ప్రదానోత్సవం, పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం మే నెల 2017లో హైదరాబాదులో నిర్వహిస్తాము. ఈ నిర్వహణలో పాల్గొన్న సహకరించిన రచయితలకు, సాహితీ అభిమానులకు తానా-మంచిపుస్తకం సగౌరవంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటోంది.
బహుమతి పొందిన రచనలు-రచయితలు
నల్లమలలో... |
శాఖమూరి శ్రీనివాస్ |
మామయ్యతో సాహసయాత్ర |
కంచనపల్లి వేంకట కృష్ణారావు |
మేథ 017 |
సలీం |
కోతుల దాడి-శీను తెలివి |
వాసంతి |
గుడ్డేళ్లగుమ్మి మారెమ్మ |
డా! ఎం. భూపాల్ |
కిట్టూ సాహసం |
డా! రావెళ్ల శ్రీనివాస్ |
తాతయ్య చిట్కా -మనవడి సత్తా |
పుట్టగుంట సురేష్‌కుమార్ |
ఆకాశవీధిలో అపరంజి బొమ్మ |
డా! వి. శ్రీనివాస్ చక్రవర్తి |
e-తరం కుర్రాడు |
నారంశెట్టి ఉమామహేశ్వరరావు |
రామదండు |
సుజలగంటి అనూరాధ |
షహీన్ |
రవికిరణ్ గోపిశెట్టి |