TANA PSV - Feb 21th


తానా “అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం”

విశ్వంలోని విభిన్న సంస్కృతుల వైవిధ్యాన్ని, మాతృభాషల వైభవాన్ని పరిరక్షణ, పర్వ్యాప్తి చేయలానే ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 వ తేదీని “అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం” గా ప్రకటించింది.

ఈ సంధర్భంగా “తానా ప్రపంచ సాహిత్య వేదిక” ఆధ్వర్యంలో ఆదివారం, ఫిబ్రవరి 21, 2021 న భారతకాలమానం రాత్రి 7: 00 గంటలకు “తల్లి భాష తెలుగు మన శ్వాస” అనే సాహిత్య కార్యక్ర మాన్ని అంతర్జాలంలో నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో గౌరవనీయులు భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ముఖ్య అతిధిగా పాల్గొని మాతృభాషల ప్రాముఖ్యంపై ప్రసంగిస్తారని తానా అధ్యక్షులు జయ శేఖర్ తాళ్లూరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జర్మనీ లోని ఎస్. ఆర్. హెచ్ విశ్వవిద్యాలయ ఆచార్యులు డా. తొట్టెంపూడి శ్రీ గణేష్ – “జర్మనీ దేశం మాతృభాషకు ఇచ్చే ప్రాధాన్యత - అన్య సాహిత్యానువాద కృషి”  అనే అంశంపై; విజయవాడ కల్చరల్ సెంటర్ కార్యనిర్వహణాధికారి, ప్రముఖ చరిత్ర పరిశోధకులు డా. ఈమని శివనాగిరెడ్డి -  “తెలుగు భాషా పరిణామక్రమం - రాజుల కాలంనుండి శిలా శాసనాల సాక్షిగా” అనే అంశంపై; ప్రముఖ సాహితీవేత్త, భారత రాష్ట్రపతి పురస్కార గ్రహీత డా. అద్దంకి శ్రీనివాస్ – “తెలుగు సాహిత్య దశ – దిశ” అనే అంశంపై; అమెరికాలో (ఆస్టిన్, టెక్సాస్) లో ఉంటున్న సంస్కృతాంధ్ర భాషల్లో దిట్ట, యువ అవధాని గన్నవరం లలిత్ ఆదిత్య (20 సం.లు) సాహిత్య ప్రసంగాలు చేస్తారని,

 తానా పాటశాల విద్యార్ధులు కృషిత నందమూరి (పెన్సిల్వేనియా), కిరణ్ యలమంచి (పెన్సిల్వేనియా), శ్రీ జరుగుల (న్యూ జెర్సీ), ప్రముఖ రంగస్థల నటులు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ, తెలుగు పద్య మణిదీపం విష్ణుభట్ల కార్తిక్ (14 సం.లు), హైదరాబాద్, అంతర్జాతీయ పద్యపోటీలలో ప్రధమ విజేత అద్దంకి వనీజ (8 సం.లు) హైదరాబాద్, విష్ణుభట్ల ప్రహర్షిత (హైదరాబాద్), కడప స్వాతి (కడప), నూకతోటి శరత్ బాబు (ఒంగోలు), ఆంజనేయులు ప్రతాప్ (అనంతపురం), దార్ల చిత్తరంజన్ దాస్ (కల్వకుర్తి), చంద్రా నాయక్ (విజయవాడ), కుంచెపు అంజి (అనంతపురం), షేక్ షాహీద్ ( ఆదిలాబాద్), బండ వెంకన్న (మహబూబాబాద్), సున్నపురాళ్ళ సాయి కిరణ్ (పూలకుంట), ఏలూరు యంగన్న కవి (అనంతపురం), బి. టి. నాగేంద్ర (అనంతపురం), పాలవలస రఘు (విజయనగరం), బి. యశోద (పార్వతీపురం), రామ మనోజ్ కుమార్ (విజయనగరం) మొదలైన గాయనీ గాయకులు పాల్గొని తెలుగు నేల, తెలుగు భాష, తెలుగు సాహిత్య వైభవ నేపథ్యం లో పాటలు, పద్యాలు ఆలపిస్తారని తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర తెలియజేశారు

తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని 

ఆదివారం, ఫిబ్రవరి 21, 2021 న భారత కాలమానం – 7:00 PM; అమెరికా – 5:30 AM PST; 7:30 AM CST; 8:30 AM EST) సమయాలలో  

ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించవచ్చని తెలియజేశారు.

 

 

మిగిలిన వివరాలకు: www.tana.org  



Event Image

Posted By: TANA Posted On: Feb 19,2021